![]() |
![]() |
(19).webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ గోదావరి Godhavari. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ 96 లో..... జానూ సూర్యకు ఫోన్ చేస్తుంది. కానీ సూర్య ఫోన్ లిఫ్ట్ చేయకుండా స్విచ్ ఆఫ్ చేస్తాడు. దీంతో అసలు సూర్య బెంగళూరు వెళ్లాడా లేదా అని జాను అనుమానపడుతుంది. మరోవైపు గౌతమి కాలేజీకి వెళ్తుండగా కళ్యాణ్ మరియు అతని స్నేహితులు ఆమెను టీజ్ చేస్తారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన సూర్య వారిని కొట్టి వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత గౌతమిని ఇంట్లో డ్రాప్ చేస్తానని చెప్పి తీసుకెళ్తాడు. ఇంటికి వెళ్లిన గౌతమి ఏడుస్తూ తము ఈ ఊరు వదిలి వెళ్లిపోవాలని.. తను కాలేజీకి వెళ్లనని చెప్తుంది. ఏం జరిగిందని జానూ అడగగా.. కళ్యాణ్ తనను టార్చర్ చేశాడని సూర్య వచ్చి కాపాడాడని గౌతమి చెప్తుంది. సూర్య వచ్చాడని వినగానే అతను బెంగళూరు వెళ్లలేదా అని జాను ఆలోచనలో పడుతుంది. ఈ ఊరు వదిలి వెళ్లిపోవడం మంచి ఆలోచన అని నందు అంటుండగానే సింహాద్రి తన కూతురు నిత్యతో కలిసి అక్కడికి వస్తాడు. మీరు ఈ ఊరు వదిలి వెళ్లిపోవాలని.. తన కూతురు పెళ్లి తన మేనల్లుడు సూర్యతో జరుగుతుందని.. అందుకు సంబంధించిన శుభలేఖను చూపిస్తాడు.
సూర్య ఈ పెళ్లికి ఒప్పుకున్నాడా అని నందు ప్రశ్నించగా తన అల్లుడు తన మాట వినకుండా ఉండడని సింహాద్రి సమాధానం ఇస్తాడు. అంతేకాదు.. ఈ పెళ్లిని మీ తోటలోనే చేస్తున్నామని.. మీ నాన్న నీ పెళ్లి చేయాలనుకున్నాడు కానీ తను తన కూతురు పెళ్లి చేస్తున్నానని సింహాద్రి అంటాడు. ఆ తర్వాత నిత్య జానూతో మాట్లాడుతూ.. అద్దం ముందు నిలబడి మనమేంటి, మన స్థాయి ఏంటో చూసుకోవాలని.. గొడవ చేయడానికి సిద్ధమైతే దానిని ఎదుర్కోవడానికి తము సిద్ధంగా ఉన్నామని బెదిరిస్తుంది.
ఈ మాటలతో జానూ బాధపడుతుంది. మరోవైపు పెళ్లి ఏర్పాట్లు జరుగుతుండగా.. తుపాన్ తన జోడీ కోసం వెతుకుతూ ఉంటాడు. అదే సమయంలో జాను కోపంగా సూర్య ఇంటికి వెళ్లి ఎందుకు తనను మోసం చేశావని నిలదీస్తుంది. దానికి సూర్య ఇప్పుడు తను ఏమీ చెప్పలేనని సమాధానమిస్తాడు. తరువాయి భాగంలో శంకర్ గుండెపోటుతో చనిపోలేదని సింహాద్రి వద్ద పనిచేసే వ్యక్తి వచ్చి జాను వాళ్లకు చెబుతాడు. అంతేకాదు.. ఈ ఊరికి కొత్తగా లేడీ పోలీస్ వస్తుందని.. ఆమెను కలిస్తే న్యాయం జరుగుతుందని లాయర్ జానుకు సలహా ఇస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |